ఫోటో మూమెంట్: ఒకే ఫ్రేమ్ లో వారణాసి గ్యాంగ్ రుద్ర, కుంభ, మందాకినీ

ఫోటో మూమెంట్: ఒకే ఫ్రేమ్ లో వారణాసి గ్యాంగ్ రుద్ర, కుంభ, మందాకినీ

Published on Nov 18, 2025 1:00 PM IST

ప్రస్తుతం ప్రపంచాన్నే షేక్ చేస్తున్న అవైటెడ్ భారతీయ చిత్రమే “వారణాసి”. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో చేస్తున్న ఈ సినిమా అనౌన్సమెంట్ తోనే వరల్డ్ వైడ్ గా భారీ క్రేజీ ఏర్పడింది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రధాన తారాగణం మహేష్ బాబు, ప్రియాంక చోప్రా అలానే నటుడు పృథ్వీరాజ్ లు కలిసిన క్రేజీ ఫ్రేమ్ ఫోటో మూమెంట్ గా మారింది.

మరి ఇందులో ముగ్గురు టాప్ స్టార్స్ ఎంతో ఛార్మింగ్ గా కనిపిస్తుండగా ఈ క్లిక్స్ చూసి మహేష్ బాబు అభిమానులు సహా ప్రియాంక, పృథ్వీల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు రుద్రగా ప్రియాంక చోప్రా మందాకినిగా అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే పవర్ఫుల్ పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా పూర్తవుతుండగా వచ్చే 2027 వేసవి కానుకగా ఈ సినిమాని మేకర్స్ రిలీజ్ కి తీసుకొస్తున్నారు.

తాజా వార్తలు