యాక్షన్ కింగ్ అర్జున్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన ఇన్వెస్టిగేటివ్ పర్సనల్ డ్రామా చిత్రం “మఫ్టీ పోలీస్” ఈ నెల 21న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. దినేష్ లక్ష్మణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంలో “తీయవర్ కులై నడుంగ” పేరుతో విడుదలైంది. జియస్సార్ ఆర్ట్స్ బ్యానర్‌పై జి. అరుల్ కుమార్ నిర్మించిన ఈ సినిమాను తెలుగులో ప్రముఖ నిర్మాత ఎ. ఎన్. బాలాజీ, శ్రీలక్ష్మిజ్యోతి క్రియేషన్స్ ద్వారా విడుదల చేస్తున్నారు.
ఒక రచయిత హత్య నేపథ్యంగా సాగే ఈ పోలీస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లో పర్సనల్ డ్రామాతో పాటు పిల్లల్లో ఇటీవలి కాలంలో కనిపిస్తున్న ఆటిజం వ్యాధి గురించి కూడా చర్చించడం విశేషం.
విడుదల సందర్భంగా శ్రీలక్ష్మిజ్యోతి క్రియేషన్స్ అధినేత ఎ. ఎన్. బాలాజీ మాట్లాడుతూ, “యాక్షన్ కింగ్ అర్జున్, ఐశ్వర్య రాజేష్‌లకు తెలుగునాట ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ‘మఫ్టీ పోలీస్’ చిత్రాన్ని అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తున్నాం. ఈ చిత్రంలో యాక్షన్, పర్సనల్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇది తెలుగులో కూడా అసాధారణ విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది,” అని తెలిపారు.


