సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా హీరోయిన్ ప్రియాంక చోప్రా అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ ల కలయికలో దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ చిత్రమే “వారణాసి”. ఇటీవల అనౌన్సమెంట్ వీడియో తోనే ఓ రేంజ్ లో హైప్ ని రేపిన ఈ సినిమా ఆ క్షణం నుంచే బాక్సాఫీస్ రన్ పై కూడా చర్చలు మొదలు పెట్టుకునేలా చేసింది.
ఇండియన్ సినిమా హిస్టరీ లోనే ఈ సినిమాకి సంచలన ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా టాక్ వినిపిస్తుండగా లాంగ్ రన్ పై కూడా హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని గ్లోబల్ లెవెల్ సినిమాగా పక్కా ప్లానింగ్ తో జక్కన్న అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఇదే అప్పుడు థియేట్రికల్ గా వర్కౌట్ అయితే మాత్రం వరల్డ్ వైడ్ గా వారణాసి ఈజీగా 3000 కోట్ల గ్రాస్ ని అందుకునే అవకాశాలు లేకపోలేవు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.
బాహుబలి, RRR సినిమాకి తన వర్క్ తో జక్కన్న గ్లోబల్ ఆడియెన్స్ కి దగ్గర కావడం జరిగింది. ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాతో మరో మెట్టు ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు. సో వరల్డ్ వైడ్ ఈ సినిమా కూడా బాహుబలి తరహాలోనే ఊహించని నంబర్స్ పెట్టినా ఎలాంటి ఆశ్చర్యం లేదు.


