సీనియర్ హీరోయిన్ త్రిష స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా, యంగ్ దర్శకుడు వశిష్ట కలయికలో వస్తున్న ‘విశ్వంభర’ చిత్రంలో నటిస్తోంది. ఐతే, గత కొంతకాలంగా త్రిష పెళ్లి పై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరోవైపు 41 ఏళ్లు దాటిపోతున్నా త్రిష ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉంది. ఐతే, త్రిష, స్టార్ హీరో విజయ్‌తో రిలేషన్లో ఉందని గతంలో రూమర్స్ వచ్చాయి. పైగా విజయ్ పుట్టినరోజు నాడు విజయ్, త్రిష కుక్కపిల్ల (ఇజ్జి)ని ఎత్తుకొని ఆడిస్తూ ఉండగా, త్రిష.. విజయ్ పక్కనే కూర్చుని నవ్వుతూ కనిపించింది.
ఆ ఫోటోతో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుంది అని గట్టిగా ప్రచారం జరిగింది. తాజాగా త్రిష, ఈ వార్తలు రియాక్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీలో నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు. వారందరితో నాకు పెళ్లి అని రాసేవారు. ఇంకా రాస్తున్నారు. అలాంటి వార్తల వల్ల నాకు అసహ్యం వేస్తోంది. దయచేసి ఇలాంటి ఫేక్ వార్తలను వైరల్ చేయకండి’ అంటూ త్రిష చెప్పుకొచ్చింది. ప్రస్తుతానికి అయితే, త్రిష సినిమాల పైనే ఫోకస్ పెట్టిందట.


