యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “కాంత”. దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కించిన బైలింగువల్ సినిమా తెలుగు, తమిళ్ లో గ్రాండ్ గా ఈ వారం రిలీజ్ కి వచ్చింది. మరి ఈ చిత్రం మొదటి రోజు మరీ అంత పాజిటివ్ టాక్ ని తెచ్చుకోలేదు కానీ డే 1 కి ఉన్న బజ్ లో సాలిడ్ ఓపెనింగ్స్ ని మాత్రం వరల్డ్ వైడ్ అందుకున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఈ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 10 కోట్లకి పైగా గ్రాస్ ని సాధించి దుల్కర్ కెరీర్ లో మరో బెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. ఇక రెండో రోజు కూడా బుకింగ్స్ ప్రామిసింగ్ గా ఉండడంతో డే 2 కూడా సినిమా వసూళ్లు బాగానే ఉంటాయని తెలుస్తుంది. సో కాంత చిత్రం మంచి వీకెండ్ పైనే కన్నేసింది అని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించగా రానా దగ్గుబాటి అలానే సముద్రఖని కీలక పాత్రల్లో నటించారు. అలాగే రానా, దుల్కర్ లు నిర్మాణం కూడా అందించారు.


