మలయాళ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ రెట్రో బ్లాక్ బస్టర్ ‘కాంత’. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. రానా, సముద్రఖని కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. దుల్కర్ సల్మాన్ ‘వేఫేర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్’, రానా దగ్గుబాటి ‘స్పిరిట్ మీడియా’ సంయుక్తంగా నిర్మించారు. నవంబర్ 14 విడుదలైన ఈ సినిమా అన్ని చోట్ల అద్భుతమైన రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
ప్రెస్ మీట్ లో రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. “కాంత సినిమాకి ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చాలా ఆనందాన్నిచ్చింది. ముఖ్యంగా పెర్ఫార్మెన్స్ లకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. దుల్కర్ గారి కెరీర్ ఫైనస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. మ్యూజిక్, విజువల్స్ టెక్నికల్ వాల్యూస్ గురించి చాలా మంచి ప్రశంసలు వస్తున్నాయి. టాప్ క్లాస్ ప్రొడక్షన్ వాల్యూ వున్నా సినిమా ఇది. మీ అందరి సపోర్ట్ కి థాంక్యూ. చాలా అద్భుతమైన ఫీడ్బ్యాక్ వస్తుంది. జోనర్ బెండింగ్ సినిమా గా వచ్చిన ఫస్ట్ ఫిలిమ్ కాంత . ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. మద్రాస్ నేపథ్యంలో జరిగే కథ కావడం, ఎలాంటి అంచనా లేకుండా చూడటంతో మద్రాస్ ఆడియన్స్ ఇంకా అద్భుతంగా కనెక్ట్ అయ్యారు” అని రానా తన ఆనందం వ్యక్తం చేశారు.


