Globe Trotter: ఇండియాస్ బిగ్గెస్ట్ ఈవెంట్ పైనే గ్లోబల్ ఆడియెన్స్ కళ్ళు!

Globe Trotter: ఇండియాస్ బిగ్గెస్ట్ ఈవెంట్ పైనే గ్లోబల్ ఆడియెన్స్ కళ్ళు!

Published on Nov 15, 2025 8:01 AM IST

Globe-Trotter

పాన్ ఇండియా లెవెల్లోనే కాకుండా పాన్ వరల్డ్ లెవెల్లోనే ఆడియెన్స్ ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ తాలూకా భారీ ఈవెంట్ పైనే ఇప్పుడు అందరి కళ్ళు పడ్డాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి ఇంటర్నేషనల్ చరిష్మా ఉన్న పర్శనాలిటీకి ఇంతకంటే ఒక పర్ఫెక్ట్ గ్లోబల్ ఎంట్రీ ఉండదు అనే రేంజ్ లో దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ గ్లోబ్ ట్రాటర్ గా ప్రపంచ దేశాల్లో చర్చగా మారింది.

మరి కేవలం ఆరంభానికే గ్లోబల్ లెవెల్ సెన్సేషన్ ని సెట్ చేసిన జక్కన్న నేడు ఇండియన్ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ ఈవెంట్ ని పూనుకున్నారు. మరి ఈ గ్రాండ్ ఈవెంట్ లో తాము ఏం రివీల్ చేస్తారు అనేదే సర్ప్రైజింగ్ గా మారింది. 100 అడుగుల భారీ తెరపై చూపించే ఆ అద్భుతం ఏంటి అనేది అభిమానులు, పాన్ ఇండియా ఆడియెన్స్ పాన్ వరల్డ్ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి అదేంటో తెలియాలి అంటే ఇంకొన్ని గంటలు ఆగక తప్పదు.

తాజా వార్తలు