ప్రభాస్, ప్రేమ్ రక్షిత్ కాంబినేషన్ తో సోషల్ మీడియా షేక్!

ప్రభాస్, ప్రేమ్ రక్షిత్ కాంబినేషన్ తో సోషల్ మీడియా షేక్!

Published on Nov 15, 2025 7:05 AM IST

Prabhas-prem-rakshit

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు పలు అవైటెడ్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ సెట్స్ పై రెండు సినిమాలు ఉండగా మరో కొన్ని సినిమాలు తన రాక కోసం ఎదురు చూస్తున్నాయి. మరి ఇవి కాకుండా ప్రభాస్ ఓకే చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. అయితే ఇలాంటి చిత్రాల్లో లేటెస్ట్ గా ఓ షాకింగ్ కాంబినేషన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రముఖ డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ ప్రభాస్ ను ఒక ప్రాజెక్ట్ కు లాక్ చేసుకున్నట్టు తెలుస్తోంది. తన దర్శకత్వంలో మొదటి సినిమాగా ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ని ప్రేమ్ రక్షిత్ లాక్ చేసుకున్నారు అనే టాక్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ ప్రస్తుతం అయితే ఇదే ట్రెండింగ్ టాపిక్ గా నిలిచింది.

తాజా వార్తలు