జీ5లో “జరణ్” స్ట్రీమింగ్: నవంబర్ 7 నుండి సైకలాజికల్ థ్రిల్లర్!

జీ5లో “జరణ్” స్ట్రీమింగ్: నవంబర్ 7 నుండి సైకలాజికల్ థ్రిల్లర్!

Published on Nov 8, 2025 8:00 AM IST

స్పైన్ చిల్లింగ్ థ్రిల్లర్‌లను ఇష్టపడే ప్రేక్షకులకు తెలుగు జీ5 శుభవార్త అందించింది. ఇటీవల ‘కిష్కిందర్’ వంటి విజయవంతమైన థ్రిల్లర్‌తో ఆకట్టుకున్న జీ5, ఇప్పుడు “జరణ్” అనే సరికొత్త హారర్ థ్రిల్లర్‌ను నవంబర్ 7 నుండి స్ట్రీమింగ్‌కు సిద్ధం చేసింది. హృషికేష్ గుప్తా రచించి, దర్శకత్వం వహించిన ఈ చిత్ర నిర్మాణంలో అనీజ్ బాజ్మి ప్రొడక్షన్స్, ఏ అండ్ ఎన్ సినిమాస్ ఎల్‌ఎల్‌పి, ఏ3 ఈవెంట్స్ అండ్ మీడియా సర్వీసెస్ పాలుపంచుకున్నాయి.

ఈ చిత్రంలో అమృతా శుభాష్, అనితా డేట్ కెల్కర్, కిషోర్ ఖడమ్, జ్యోతి మల్షే, అయానీ జోషి ప్రధాన పాత్రలు పోషించారు. కథనం ప్రకారం, రాధ (అమృత శుభాష్) తన కుమార్తె సయీతో కలిసి పూర్వీకుల ఇంటికి వెళ్లినప్పుడు, అక్కడ దొరికిన పాత బొమ్మ కారణంగా ఆమెకు ఎదురైన వింత అనుభవాలు, భయానక సంఘటనల చుట్టూ ఈ మిస్టరీ తిరుగుతుంది.

నిర్మాత ఈ సినిమా మానసిక ప్రవృత్తికి అద్దం పడుతుందని, వాస్తవం, భ్రమల మధ్య తేడా చెరిగిపోయే సన్నివేశాలు ప్రేక్షకులను ప్రతి క్షణం థ్రిల్ చేస్తాయని తెలిపారు. అద్భుతమైన నటన, భావోద్వేగభరితమైన కథనంతో ‘జరణ్’ వీక్షకులను కట్టిపడేస్తుందని భావిస్తున్నారు.

తాజా వార్తలు