హీరో సుధీర్ బాబు నటించిన లేటెస్ట్ చిత్రం ‘జటాధర’ నవంబర్ 7న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది. ఈ సినిమాను వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో సోనాక్షి సిన్హా, శిల్పా శిరోధ్కర్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. అయితే, ఈ చిత్ర ప్రమోషన్స్‌లో సుధీర్ బాబు తన లాస్ట్ చిత్రం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఆయన నటించిన ‘మా నాన్న సూపర్ హీరో’ చిత్రం చక్కగా రూపొందించినా, దానికి బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ దక్కలేదు. అయితే, ఆ సినిమాను థియేటర్లలో చూసిన ప్రేక్షకులు, ఓటీటీలో వీక్షించిన వారు సినిమాకు మంచి మార్కులు వేశారని.. కానీ, ఆ సినిమా రిలీజ్ సమయంలో సరైన ప్రమోషన్స్ జరగలేదని సుధీర్ బాబు అన్నారు. కనీసం ఓ సీరియల్ స్థాయిలో కూడా ఆ సినిమాకు ప్రమోషన్స్ జరగకపోవడమే దాని ఫెయిల్యూర్‌కు కారణమని సుధీర్ బాబు అన్నారు.
ఇలాంటి సినిమాలకు ప్రమోషన్స్‌పై మేకర్స్ ఫోకస్ చేస్తే బాగుంటుందని తాను తెలుసుకున్నట్లు సుధీర్ బాబు తెలిపారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.


