బాలయ్య సినిమా అప్ డేట్ వాయిదా !

బాలయ్య సినిమా అప్ డేట్ వాయిదా !

Published on Nov 3, 2025 3:02 PM IST

NBK111

బాలయ్య బాబు – గోపీచంద్ మలినేని కలయికలో సతీష్ కిలారు నిర్మిస్తున్న పీరియాడిక్ సినిమా కొత్త అప్ డేట్ వచ్చింది. ఈ రోజు ఈ సినిమాలో నటించబోతున్న హీరోయిన్ ను వెల్లడిస్తామని మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఈ రోజు మధ్యాహ్నం 12:01 గంటలకు హీరోయిన్ అప్ డేట్ రావాల్సి ఉంది. అయితే, ఈ అప్ డేట్ ను వాయిదా వేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు.

తమ అధికారిక ప్రకటనలో, “చేవెళ్ల సమీపంలో జరిగిన హృదయ విదారక సంఘటన దృష్ట్యా, ఈరోజు మధ్యాహ్నం 12:01 గంటలకు జరగాల్సిన ప్రకటనను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. బాధిత కుటుంబాలకు చిత్ర బృందం తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.” కాగా ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తోందని పుకారు ఉంది, కానీ అధికారిక అప్ డేట్ కోసం మనం వేచి ఉండాలి.

ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో కొంత హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ వుంటుందని, బాలకృష్ణ మహరాజుగా కనిపిస్తారని టాక్. ప్రస్తుతం ఈ సినిమా బృందం, దర్శకుడు గోపీచంద్ మలినేని రాజస్థాన్ లో కోటల రెక్కీ లో వున్నారు. అన్నట్టు ఈ సినిమా గురించి గోపీచంద్‌ మలినేని ఎక్స్‌ వేదికగా ఆ మధ్య స్పందిస్తూ.. ‘‘గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌ ఈజ్‌ బ్యాక్‌.. ఈసారి మా గర్జన మరింత గట్టిగా ఉండనుంది. బాలకృష్ణతో కలిసి మరోసారి వర్క్‌ చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది చరిత్రలో నిలిచిపోయే చిత్రం కానుంది’’ అని తన పోస్ట్ లో పేర్కొన్నారు. నందమూరి బాలకృష్ణ నటించనున్న 111 ప్రాజెక్ట్‌ ఇది

తాజా వార్తలు