ఓటీటీలో పుష్ప 2, కల్కి చిత్రాలకు ధీటుగా నిలబడ్డ నాని సినిమా.. మాస్ రికార్డ్

ఓటీటీలో పుష్ప 2, కల్కి చిత్రాలకు ధీటుగా నిలబడ్డ నాని సినిమా.. మాస్ రికార్డ్

Published on Oct 30, 2025 1:30 PM IST

నాచురల్ స్టార్ నానికి ఇప్పుడు బిగ్ స్క్రీన్స్ పరంగా కానీ ఓటీటీల పరంగా కానీ మంచి క్రేజ్ అండ్ మార్కెట్ ని తను బిల్డ్ చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. నాని సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనే రేంజ్ ఇప్పుడు వచ్చింది. ఇలానే తన సినిమాలకి నాన్ థియేట్రికల్ గట్టిగా జరుగుతుంది.

మరి ఇటీవల నాని నటించిన సూపర్ హిట్ చిత్రం హిట్ 3 ఓటీటీలో క్రియేట్ చేసిన సెన్సేషన్ మరోసారి వైరల్ గా మారింది. అయితే హిట్ 3 సినిమా నెట్ ఫ్లిక్స్ లో మొదటి వీకెండ్ స్ట్రీమింగ్ లో 4 మిలియన్ కి పైగా వ్యూస్ ని సొంతం చేసుకుంది.

ఇది రీసెంట్ భారీ సినిమాలు ఓజి, దేవర కంటే ఎక్కువ కాగా హిట్ 3 కేవలం పుష్ప 2, కల్కి 2898 ఎడి లాంటి పాన్ ఇండియా భారీ హిట్స్ తర్వాత మూడో స్థానంలో ఉండడం అనేది సంచలనం అని చెప్పాలి. దీని బట్టి ఓటీటీలో నాని సినిమాల ఆదరణ ఎలా ఉంటుంది అనేది అర్ధం చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చే ప్యారడైజ్ పాన్ వరల్డ్ లెవెల్లో రానుంది. దానికి ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందో చూడాల్సిందే.

తాజా వార్తలు