టాలీవుడ్ సినీ సామ్రాజ్యంలో తమకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న కుటుంబాల్లో ఘట్టమనేని కుటుంబం కూడా ఒకటి. సూపర్ స్టార్ కృష్ణ మొదలుకొని ఇప్పుడు గౌతమ్ కృష్ణ, అశోక్ గల్లా వరకు వచ్చింది. ఇక లేటెస్ట్ గా వీరి కుటుంబం నుంచి వెండితెరపై తళుక్కుమనేందుకు రాబోతున్న యంగ్ హీరోయిన్ జాన్వీ స్వరూప్ ఘట్టమనేని.
బ్యూటిఫుల్ లుక్స్, చక్కని అభినయంతో కనిపిస్తున్న ఈ యువ నటి ఇప్పుడు తెలుగు సినిమా అరంగేట్రం చేసేందుకు సిద్ధంగా ఉందట. సూపర్ స్టార్ కృష్ణ మనవరాలు, మంజుల ఘట్టమనేని కూతురు మహేష్ బాబుకి మేనకొడలు అయినటువంటి జాన్వీ అతి త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుందట. దీనితో ఈ టాక్, ఇంకా ఆమె గార్జియస్ క్లిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఆమె ఎంట్రీ ఎవరితో ఉంటుంది ఎలా ఉంటుంది అనేది రివీల్ కావాల్సి ఉంది.


