యుద్ధానికి సిద్ధమైన ‘ఫౌజీ’.. ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించిన హను!

యుద్ధానికి సిద్ధమైన ‘ఫౌజీ’.. ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించిన హను!

Published on Oct 23, 2025 11:18 AM IST

Fauzi

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ చిత్రం నుండి సాలిడ్ అప్డేట్ వచ్చేసింది. దర్శకుడు హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్న పీరియాడిక్ చిత్రంలో ప్రభాస్ నటిస్తుండటంతో ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు.

ఈ సినిమాకు ‘ఫౌజీ’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో ప్రభాస్ ఓ సైనికుడి పాత్రలో నటిస్తున్నాడు. పద్మవ్యూహాన్ని ఛేదించే అర్జునుడిగా.. పాండవులకు అండగా నిలిచే కర్ణుడిగా..విలువిద్యలో ఆరితేరిన ఏకలవ్యుడిగా.. ఈ ‘ఫౌజీ’ యుద్ధానికి సిద్ధమవుతున్నాడు.. అంటూ మేకర్స్ ప్రభాస్ పాత్రను ఎలివేట్ చేశారు.

ఇక ఈ సందర్భంగా వారు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ప్రభాస్ ఫెరోషియస్ లుక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులకు పూనకాలు తెప్పించేలా ఉండబోతున్నాయని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాలో అందాల భామ ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తుండగా విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

తాజా వార్తలు