OG: సుజీత్ ఫైర్ టేకింగ్ మరోసారి వైరల్!

OG: సుజీత్ ఫైర్ టేకింగ్ మరోసారి వైరల్!

Published on Oct 19, 2025 9:03 PM IST

pawan kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ చిత్రమే “ఓజి”. మంచి హైప్ నడుమ వచ్చిన ఈ సినిమా 300 కోట్లకి పైగా వసూళ్లు అందుకొని అదరగొట్టింది. ఇక ఓటిటి ఎంట్రీ దగ్గరకి వస్తున్న ఈ సినిమా హై మూమెంట్స్ మరోసారి వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా లేటెస్ట్ గా వచ్చిన హంగ్రీ చీతా సాంగ్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఒకప్పుడు కోలీవుడ్ హీరోస్ తాలూకా వీడియోలు బాగా వైరల్ అయితే ఇప్పుడు టాలీవుడ్ వంతు వచ్చింది. ఈ సాంగ్ లో సుజీత్ చూపించిన మాస్ ప్రెజెంటేషన్ కోసం మళ్ళీ పవన్ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. ఫైర్ షోతో పవన్ యాటిట్యూడ్, తన స్వాగ్ ని ఈ లెవెల్లో ప్రెజెంట్ చేసినందుకు సుజీత్ కి మరోసారి థాంక్స్ చెప్పకుండా ఉండలేకపోతున్నారు. ఇక ఓటిటిలోకి వచ్చాక సినిమాకి రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాల్సిందే.

తాజా వార్తలు