బేబమ్మ కల కలగానే ఉండిపోయిందా..?

బేబమ్మ కల కలగానే ఉండిపోయిందా..?

Published on Oct 18, 2025 2:00 AM IST

Krithi Shetty

ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి అతి తక్కువ సమయంలో తనకంటూ మంచి ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంది. ఈ బ్యూటీ వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారింది. అయితే, గతకొద్ది చిత్రాలు సరిగా ఆడకపోవడంతో కృతి శెట్టి కాస్త వెనుకబడింది. ఇక ఇప్పుడు ఈ బ్యూటీ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.

అయితే, ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు గోవింద తనయుడు యశ్వర్ధన్ అహుజ హీరోగా నటిస్తున్న సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా బాలీవుడ్‌లో లాంచ్ కానుంది. కానీ, ఇప్పుడు ఈ సినిమా నుంచి కృతి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీనికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

దీంతో కృతి శెట్టి బాలీవుడ్ కల కలగానే ఉండిపోయిందని ఆమె ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మరి బేబమ్మకు బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు వస్తుందో చూడాలి.

తాజా వార్తలు