‘ది రాజా సాబ్’.. లవ్ హీట్ పెంచుతున్న థమన్

‘ది రాజా సాబ్’.. లవ్ హీట్ పెంచుతున్న థమన్

Published on Oct 15, 2025 11:12 AM IST

The-Raja-Saab

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ ఇంకా రిద్ధి కుమార్ లు హీరోయిన్స్ గా దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న అవైటెడ్ సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రమే “ది రాజా సాబ్”. మరి ఈ సినిమా నుంచి డార్లింగ్ హీరో ప్రభాస్ పుట్టినరోజు కానుకగా సాలిడ్ ట్రీట్ లు రానున్న సంగతి తెలిసిందే. వాటిలో సినిమా ఫస్ట్ సింగిల్ కూడా ఒకటి. అయితే దీనిపై సంగీత దర్శకుడు థమన్ మాత్రం లవ్ హీట్ ని ఫ్యాన్స్ లో పెంచుతున్నాడు.

అక్టోబర్ 23 మ్యూజికల్ ట్రీట్ పెరుగుతుంది అంటూ గ్రాఫ్ చూపిస్తూ ఫ్యాన్స్ ని మరింత ఎగ్జైట్ చేస్తున్నాడు. దీనితో ఫ్యాన్స్ థమన్ ఇచ్చిన ఆ ఫస్ట్ సింగిల్ కోసం మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రంలో సంజయ్ దత్ పవర్ఫుల్ రోల్ చేస్తుండగా ప్రభాస్ కూడా డ్యూయల్ షేడ్స్ లో మెస్మరైజ్ చేయనున్నాడు. ఇక దీనితో పాటుగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి రాబోతుంది.

తాజా వార్తలు