ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ గా మీసాల పిల్ల.. అనీల్ రావిపూడిని ఎవ్వరూ ఆపలేరు

ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ గా మీసాల పిల్ల.. అనీల్ రావిపూడిని ఎవ్వరూ ఆపలేరు

Published on Oct 15, 2025 7:02 AM IST

లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా హీరోయిన్ నయనతార నటించిన లేటెస్ట్ చిత్రమే మన శంకర వర ప్రసాద్ గారు. దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ అనీల్ రావిపూడి మార్కులో అదిరింది. ఇలా అవైటెడ్ మీసాల పిల్ల ఫస్ట్ సింగిల్ గా వచ్చింది. ప్రోమోకే సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ అందులో క్వాలిటీ, బ్యాక్గ్రౌండ్ లో కూర్చి బాలేదు, గోడ బాలేదు అంటూ కామెంట్స్ చేసినవాళ్ళు కూడా లేకపోలేదు.

ఇప్పుడు ఫుల్ సాంగ్ వచ్చి కూడా అదే చార్ట్ బస్టర్ రెస్పాన్స్ ని అందుకుంది. బాస్ గ్రేస్, మాజీ భార్యా భర్తలు నడుమ అనీల్ రాబట్టిన కెమిస్ట్రీలు సాలిడ్ గావర్కవుట్ అయ్యినట్టు కనిపిస్తున్నాయి. వీటితో సాంగ్ మాత్రం ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ అనే టాక్ నే ఎక్కువ వినిపిస్తోంది. దీనితో ఫ్యామిలీ ఆడియెన్స్ ని థియేటర్స్ కి రప్పించే విషయంలో అనీల్ రావిపూడి విధ్వంసంని మరోసారి ఎవరూ ఆపలేరు అనే చెప్పి తీరాలి. ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించగా సాహు గారపాటి నిర్మాణం వహిస్తున్నారు.

తాజా వార్తలు