బుకింగ్స్ లో ‘కాంతార 1’ మరో భారీ ఫీట్!

బుకింగ్స్ లో ‘కాంతార 1’ మరో భారీ ఫీట్!

Published on Oct 5, 2025 6:01 PM IST

Kantara-Chapter-1

కన్నడ టాలెంటెడ్ నటుడు అలాగే దర్శకుడు రిషబ్ శెట్టి హీరోగా తన దర్శకత్వంలోనే తెరకెక్కించిన అవైటెడ్ డివోషనల్ చిత్రమే “కాంతార 1”. మంచి అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా వాటిని అందుకొని భారీ రికార్డులు కన్నడ సినిమా నాట సెట్ చేస్తుంది. పాన్ ఇండియా లెవెల్లో రికార్డులు కొల్లగొడుతున్న ఈ చిత్రం సెన్సేషనల్ బుకింగ్స్ ని బుక్ మై షోలో నమోదు చేస్తుంది.

ఇలా కాంతార 1 ఏకంగా ఇపుడు 5 మిలియన్ టికెట్ సేల్స్ ని జరుపుకొని మరో భారీ ఫీట్ ని సెట్ చేసి కన్నడ సినిమా దగ్గర ఇంకో రికార్డు ఖాతాలో వేసుకుంది. మరి ఈ ర్యాంపేజ్ ఇప్పట్లో కూడా ఆగేలా లేదనే చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా దీనికి ముందు సినిమాలో ఉన్న అందరు నటులు దాదాపు ఈ సినిమాలో కూడా ఉన్నారు. అలాగే హోంబళే ఫిల్మ్స్ వారు నిర్మాణం అందించారు.

తాజా వార్తలు