సుకుమార్‌ను మరింత వెయిటింగ్‌లో పెట్టిన రామ్ చరణ్.. కారణం ఇదేనా..?

సుకుమార్‌ను మరింత వెయిటింగ్‌లో పెట్టిన రామ్ చరణ్.. కారణం ఇదేనా..?

Published on Oct 5, 2025 7:01 AM IST

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చి బాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న “పెద్ది” సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో రామ్ చరణ్ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ అనుకున్నదానికంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది. మొదటగా ఈ ప్రాజెక్ట్‌ను 2025 అక్టోబర్‌లో పూర్తి చేయాలని మేకర్స్ భావించారు.

ఇక ఆ తర్వాత డిసెంబర్ నుండి సుకుమార్ దర్శకత్వంలో కొత్త సినిమా మొదలుపెట్టాలని చరణ్ ప్లాన్ చేశారు. ఒకే ప్రాజెక్ట్ కోసం ఏడాదికి మించి సమయం వెచ్చించనని ఆయన అప్పుడే చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం పెద్ది షూటింగ్ 2026 జనవరి నాటికి పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

చరణ్ పర్ఫెక్షన్ కోసం పడుతున్న కృషి, అలాగే బుచ్చి బాబుకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం వల్ల ఎక్కువ సమయం పడుతుందని సినీ సర్కిల్స్ టాక్. దీంతో సుకుమార్ ప్రాజెక్ట్ ఇక 2026 మేలోనే రెగ్యులర్ షూట్ మొదలు అయ్యే అవకాశం కనిపిస్తోంది. మరి సుకుమార్ అప్పటివరకు ఖాళీగా ఉంటాడా అనేది చూడాలి.

తాజా వార్తలు