రిషబ్ శెట్టి హీరోగా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా రిషబ్ శెట్టి దర్శకత్వంలోనే తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “కాంతార 1”. మంచి హైప్ మధ్య వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం సెన్సేషనల్ బుకింగ్స్ తో దూసుకెళ్తుంది. తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో సాలిడ్ నంబర్స్ అందుకుంటున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రెండు రోజులు పూర్తి చేసుకోగా ఈ రెండు రోజుల్లో గట్టి నంబర్స్ ఈ సినిమా అందుకున్నట్టు తెలుస్తుంది.
మొదటి రోజే 89 కోట్ల గ్రాస్ ని అందుకున్న ఈ సినిమా రెండో రోజుకి ఇంకో 65 కోట్లకి పైగా గ్రాస్ ని రెండో రోజు వరల్డ్ వైడ్ గా అందుకొని మొత్తం 155 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకున్నట్టు కన్నడ సినీ వర్గాలు చెబుతున్నాయి. దీనితో ఒక సెన్సేషనల్ వీకెండ్ పై ఈ చిత్రం కన్నేసింది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రంలో జైరాం తదితరులు కీలక పాత్రల్లో నటించగా హోంబళే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు.