రష్మిక, విజయ్ లపై ఆ వార్తలు నిజమేనా!

రష్మిక, విజయ్ లపై ఆ వార్తలు నిజమేనా!

Published on Oct 4, 2025 8:01 AM IST

rashmika-vijay

మన టాలీవుడ్ దగ్గర ప్రెజెంట్ యువతలో మంచి క్రేజ్ ఉన్న కపుల్స్ లో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ అలాగే నేషనల్ క్రష్ రష్మిక మందన్నాల జంట కూడా ఒకటి. మరి ఈ ఇద్దరు గత కొన్నాళ్ల నుంచి లవ్ ఉన్నారనే టాక్ అందరికీ తెలుసు. కానీ లేటెస్ట్ గా ఓ షాకింగ్ ట్విస్ట్ వీరిపై వైరల్ గా వినిపిస్తుంది. దీనితో వీరిద్దరూ నిన్ననే ఎంగేజ్మెంట్ చేసేసుకున్నట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి.

పైగా రష్మిక నుంచి పలు ఫోటోలు కూడా ఈ రూమర్స్ కి దగ్గరగానే కనిపిస్తుండడంతో ఈ యువ జంట పెళ్లి వార్తలు నిజమే అన్నట్టు అనిపిస్తుంది. ఇక ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుండడంతో అభిమానులు ఇంకా వారి శ్రేయోభిలాషులు ఆ జంటకి తమ బెస్ట్ విషెస్ చెబుతున్నారు. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా బయటకి రావాల్సి ఉంది. ఇక రష్మిక నుంచి ఈ దీపావళి కానుకగా “థామ్మా” రాబోతుండగా కింగ్డమ్ తర్వాత విజయ్ తన తదుపరి ప్రాజెక్ట్ లపై దృష్టి పెట్టాడు.

తాజా వార్తలు