తుపాకీ పట్టిన శ్రీవిష్ణు.. లాల్ సలామ్ అంటున్న ‘కామ్రేడ్ కళ్యాణ్’

తుపాకీ పట్టిన శ్రీవిష్ణు.. లాల్ సలామ్ అంటున్న ‘కామ్రేడ్ కళ్యాణ్’

Published on Oct 2, 2025 12:40 PM IST

యంగ్ హీరో శ్రీవిష్ణు ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా ఆయన మరో ఆసక్తికర సినిమాలో నటిస్తున్నాడు. దర్శకుడు జానకిరామ్ మారెళ్ల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను దసరా సందర్భంగా అనౌన్స్ చేశారు.

పూర్తి యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాకు ‘కామ్రేడ్ కళ్యాణ్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ మేరకు టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో నక్సలైట్‌గా శ్రీవిష్ణు నటిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

ఇక ఈ సినిమాను కోన వెంకట్ ప్రొడ్యూస్ చేస్తుండగా మహిమ నంబియార్, రాధిక శరత్ కుమార్, షైన్ టామ్ చాకో తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు విజయ్ బుల్గనిన్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు