మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కుతుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
ఇక దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ చిత్రం నుంచి మెగా అప్డేట్స్ రానున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ వెల్లడించింది. అయితే, ఈ చిత్రంలో హీరోయిన్గా నయనతార ఫస్ట్ లుక్‌ను రివీల్ చేసిన మేకర్స్ తాజాగా మరో అప్డేట్ కూడా ఇచ్చారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆల్బమ్‌ను త్వరిలో రిలీజ్ చేస్తున్నట్లు తెలిపిన చిత్ర యూనిట్, ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ సాంగ్ ప్రోమోను రేపు (అక్టోబర్ 2న) రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు.
ఈ సాంగ్‌లో మెగా క్లాస్, మెగా స్వాగ్, మెగా విక్టరీ అభిమానులను అలరించేందుకు రెడీగా ఉందని మేకర్స్ చెబుతున్నారు. ఇక ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ప్రొడ్యూస్ చేస్తున్నారు.
MEGA ALBUM LOADING ????????
Get ready to vibe and celebrate the MEGA Grace,
MEGA Class,
MEGA Swag &
MEGA VICTORY MASS of #ManaShankaraVaraPrasadGaru ❤️????First Single Promo out Tomorrow ????????
A #Bheemsceciroleo Musical ????#ChiruANIL ~ #MSG Sankranthi 2026 RELEASE ????
Megastar… pic.twitter.com/UHkxYDvtgn
— Shine Screens (@Shine_Screens) October 1, 2025