మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో “మన శంకర వరప్రసాద్ గారు” అనే ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ రాబోతుంది. ఈ సినిమాలో మరో హీరో వెంకటేష్ కూడా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. అలాగే, ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార నటిస్తోన్న విషయం తెలిసిందే. ఐతే, తాజాగా అనిల్ రావిపూడి ఈ సినిమా గురించి ఓ అప్డేట్ షేర్ చేశారు. నయనతార పాత్రను పరిచయం చేస్తూ అనిల్ ఓ పోస్టర్ పంచుకున్నారు. ఈ సినిమాలో నయనతార శశిరేఖ పాత్రలో నటిస్తున్నట్లు అనిల్ రావిపూడి తెలిపారు.
నయనతారతో కలిసి వర్క్ చేయడం ఎంతో ఆనందంగా ఉందని అనిల్ రావిపూడి చెప్పారు. తన పాత్రతో సినిమాకు మరింత అందాన్ని ఆమె తెచ్చారని తెలిపారు. ప్రస్తుతం ఓ ప్రత్యేక సెట్లో పాటల చిత్రీకరణ జరుగుతోంది. అన్నట్టు 2026 సంక్రాంతికి ఈ సినిమాతో ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇవ్వనున్నట్లు మేకర్స్ ఇప్పటికే చెప్పారు. ఇక అక్టోబర్ 5 నుంచి వెంకటేశ్ ఈ షూటింగ్లో భాగం కానున్నారు. సాహు గారపాటి, సుస్మిత (చిరంజీవి కుమార్తె) సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.