ఫౌజీ డైరెక్టర్‌కు ప్రభాస్ వార్నింగ్.. కారణమేమిటంటే..?

ఫౌజీ డైరెక్టర్‌కు ప్రభాస్ వార్నింగ్.. కారణమేమిటంటే..?

Published on Sep 30, 2025 12:29 AM IST

Fauji

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘సీతా రామం’తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న దర్శకుడు హను రాఘవపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 2026లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

అయితే, ఈ చిత్ర షూటింగ్ సమయంలో దర్శకుడు హను రాఘవపూడికి ప్రభాస్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సెట్స్‌లో హను రాఘవపూడి చిన్న విషయాలకే తీవ్ర కోపం చూపిస్తారని, పలుమార్లు ఆగ్రహం ఎక్కువైందని వార్తలు వస్తున్నాయి. దీనిపై ప్రభాస్ ఆయనకు వార్నింగ్ ఇచ్చారట. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలని.. మీలోని ప్యాషన్, డెడికేషన్ సినిమాకు ఉపయోగపడేలా ఉండాలని ఆయనకు సూచించారట.

ఈ చిత్రంలో ఇమాన్వి ఇస్మాయిల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, రాహుల్ రవీంద్రన్, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు