పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “ఓజి”. వీరి నుంచి వచ్చిన ఈ సినిమా సాలిడ్ టాక్ ని సొంతం చేసుకొని మంచి బుకింగ్స్ తో అయితే వెళుతుంది. ఇక ఈ సినిమా కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి సుజీత్ పార్ట్ 2 కూడా కన్ఫర్మ్ చేసాడు. కానీ అసలు తమ ఓజి యూనివర్స్ నుంచి ఇప్పుడు వచ్చిన సినిమాతో కలిపి మొత్తం మూడు సినిమాలు అని కన్ఫర్మ్ చేసాడు.
మరి థమన్, సుజీత్ ఇంకా వారి టీం అంతా కలిసి ఓజి యూనివర్స్ అనే ఒక గ్రూప్ లో ఓజి కోసమే చర్చించుకుంటామని థమన్ తెలిపాడు. అలాగే ఓజి కి ప్రీక్వెల్, సీక్వెల్ రెండూ ఉంటాయని రెండు సినిమాలు కూడా ఒకేసారి షూటింగ్ చేసేసి రెండు సినిమాలూ విడుదల చేస్తామని సుజీత్ క్రేజీ అప్డేట్ అందించాడు. దీనితో పవన్ ఫ్యాన్స్ కి ఇంకో రెండు సినిమాలు బాకీ ఉన్నాయని చెప్పవచ్చు.