OG: పవన్ బాక్సాఫీస్ పుల్ కి అసలు టెస్ట్..!

OG: పవన్ బాక్సాఫీస్ పుల్ కి అసలు టెస్ట్..!

Published on Sep 29, 2025 12:00 AM IST

OG-Pawan-Kalyan-1

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ ప్యాకెడ్ డ్రామానే “ఓజి”. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ హైప్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం ప్రీమియర్స్ నుంచి వీకెండ్ వరకు స్ట్రాంగ్ హోల్డ్ తో రాణించింది.

కానీ ఇక్కడ వరకు పవన్ స్టామినా, వీకెండ్ సానుకూలత ఉండడంతో జనం థియేటర్స్ లో టికెట్ రేట్స్ పెద్దగా పట్టించుకోకుండా వచ్చారు. కానీ ఇప్పుడు సోమవారం వర్కింగ్ డే వచ్చింది. ఈ చిత్రానికి ముందు సినిమాల రేంజ్ లో భారీ నెగిటివ్ టాక్ రాలేదు. పవన్ పై క్రేజీ ఎలివేషన్స్, సుజీత్ స్ట్రాంగ్ వర్క్ లు పైగా థమన్ మ్యూజిక్ బ్లాస్ట్ లు వంటి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి.

అయినప్పటికీ పవన్ సినిమా చూసేందుకు జనం వస్తున్నారా లేదా అనేది ఈ సోమవారం నుంచి అసలు పరీక్షతో తేలుతుంది అని చెప్పాలి. బహుశా అత్తారింటికి దారేది తర్వాత బాక్సాఫీస్ దగ్గర సరైన లాంగ్ రన్ పవన్ కి పడలేదు. మరి దానిని ఓజి బ్రేక్ చేస్తుందా లేదా అనేది చూడాలి.

తాజా వార్తలు