టాలీవుడ్‌లో రిలీజ్ అయిన రీసెంట్ ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘మిరాయ్’ బాక్సాఫీస్ దగ్గర సూపర్ టాక్‌తో దూసుకెళ్తోంది. యంగ్ హీరో తేజ సజ్జా ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ అందుకున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమాలో మనోజ్ మంచు విలన్‌గా నటించాడు.
అయితే, దసరా సీజన్‌లో ఈ సినిమాను మరింత మంది ప్రేక్షకులు వీక్షించే విధంగా ఈ చిత్ర నిర్మాతలు టికెట్ రేట్లు తగ్గించారు. తెలుగు రాష్ట్రాల్లోని సింగిల్ స్క్రీన్స్‌లో బాల్కనీ టికెట్ ధరను రూ.150గా, ఫస్ట్ క్లాస్‌ను రూ.105గా నిర్ణయించారు. సరసమైన టికెట్ రేట్లు ఫెస్టివల్ హాలిడేలో సినిమా రన్‌కి పెద్ద ప్లస్ కానున్నాయని వారు భావిస్తున్నారు.
ఈ చిత్రంలో రితికా నాయక్, శ్రీయా శరణ్, జగపతి బాబు, జయరామ్, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రలు పోషించారు. మరి ఈ సినిమాకు టికెట్ రేట్ల తగ్గింపు ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.