కన్నడలో తెరకెక్కిన ‘కాంతార’ చిత్రంతో యాక్టర్ కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేశాడు. ఇక ఇప్పుడు ఆ సినిమాకి ప్రీక్వెల్‌గా ‘కాంతార: ఛాప్టర్ 1’ను అక్టోబర్ 2న పలు భాషల్లో రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే కర్ణాటకలో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా రిషబ్ శెట్టి ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో తన కొత్త సినిమా ‘జై హనుమాన్’ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రిషబ్ శెట్టి మాట్లాడుతూ.. “కాంతార : చాప్టర్ 1 విడుదలకు ముందే మరో సినిమాకు సైన్ చేయాలని నేను అనుకోలేదు. కానీ ప్రశాంత్ వర్మ చెప్పిన కథ నన్ను ఎంతలా ఆకట్టుకుందంటే, వెంటనే ఆయనకు ఓకే చెప్పాను. స్క్రిప్ట్ అద్భుతంగా ఉంది, కథ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఇప్పటికే ఫోటోషూట్ పూర్తి చేశాం. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి” అని తెలిపారు.
ఈ భారీ చిత్రాన్ని ఎప్పుడు సెట్స్‌పైకి తీసుకెళ్తారో త్వరలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు. జై హనుమాన్ అనేది 2024లో వచ్చిన బ్లాక్‌బస్టర్ హనుమాన్ చిత్రానికి సీక్వెల్. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను టాలీవుడ్‌లోని అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.