టాలీవుడ్లో రిలీజ్ అయిన రీసెంట్ బ్లాక్‌బస్టర్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం ‘లిటిల్ హార్ట్స్’ ప్రేక్షకులను అలరించడంలో మంచి విజయాన్ని అందుకుంది. మౌళి తనుజ్, శివానీ నగరం జంటగా నటించిన ఈ సినిమాను సాయి మార్తాండ్ డైరెక్ట్ చేశారు.
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా యూత్‌ను ఆకట్టుకోవడంలో రఫ్ఫాడించింది. ఇక ఈ సినిమాను బన్నీ వాస్, వంశీ నందిపాటి డిస్ట్రిబ్యూట్ చేయగా, ఈ చిత్రం వారికి భారీ లాభాలను తెచ్చిపెట్టింది.
థియేటర్లలో కామెడీ రోలర్ కోస్టర్‌గా ప్రేక్షకులను మెప్పించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను లాక్ చేసుకుంది. ఈటీవీ విన్ ఓటీటీలో ఈ చిత్రం అక్టోబర్ 1 నుంచి స్ట్రీమింగ్కు రానుంది. ఇక ఈ ఓటీటీ స్ట్రీమింగ్‌లో ఈ చిత్రం ఎక్స్టెండెడ్ కట్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు.