OG : అక్కడ పవన్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ ప్రీమియర్ కలెక్షన్స్..!

OG : అక్కడ పవన్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ ప్రీమియర్ కలెక్షన్స్..!

Published on Sep 25, 2025 11:08 PM IST

og

ఓజీ.. ప్రస్తుతం టాలీవుడ్‌ను ఊపేస్తున్న సినిమా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్‌కు తోడుగా ఫ్యాన్ బోయ్ సుజీత్ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామా చిత్రాన్ని చూసేందుకు అభిమానులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇక ఈ సినిమాకు ఓవర్సీస్ మార్కెట్‌లోనూ కనీవిని ఎరుగని రెస్పాన్స్ దక్కుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నార్త్ అమెరికాలో ప్రీ-సేల్స్ ద్వారా $3 మిలియన్ మార్క్ దాటింది.

అయితే, తాజా అప్‌డేట్ ప్రకారం కేవలం ప్రీమియర్స్ ద్వారా ఈ సినిమా ఏకంగా $3.138 మిలియన్ వసూలు చేసినట్లు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ ప్రకటించారు. దీంతో ఈ సినిమా రజనీకాంత్ – లోకేష్ కనగరాజ్ ‘కూలీ’ని కూడా అధిగమించింది. కంటెంట్ డిలే లేకపోతే ‘కల్కి 2898 AD’ రికార్డును కూడా బద్దలు కొట్టేది.

ప్రస్తుతం ఓజీ నార్త్ అమెరికాలో $3.4 మిలియన్ దాటేసి, ఫస్ట్ వీకెండ్‌లో మరింత సెన్సేషనల్ నంబర్లు కలెక్ట్ చేస్తుందని సినీ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాలో విలన్‌గా ఇమ్రాన్ హష్మీ, హీరోయిన్‌గా ప్రియాంక మోహన్ నటించారు.

తాజా వార్తలు