రీసెంట్ గా సోషల్ మీడియాని ఓ రేంజ్ లో షేక్ చేసిన షాకింగ్ రూమర్ ఏదన్నా ఉంది అంటే అది సూపర్ స్టార్ రజినీకాంత్ అలాగే యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ల మల్టీస్టారర్ కోసమే అని చెప్పాలి. రజినీకాంత్ కూలీ రిలీజ్ అయ్యాక లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లోనే ఈ భారీ మల్టీస్టారర్ ఉంటుంది అని టాక్ వచ్చింది. ఆ తర్వాత కమల్ కూడా రజినీకాంత్ తో సినిమాపై ఓపెన్ అవ్వడం దాదాపు ఈ వార్త నిజమే అని మరింత కన్ఫర్మ్ అయింది.
ఇక లేటెస్ట్ గా రజినీకాంత్ కూడా కమల్ తో సినిమాపై ఓపెన్ అయ్యి తమ కాంబినేషన్ లో ఉందని తెలిపారు. కానీ ఇక్కడ కొత్త ట్విస్ట్ ఏంటంటే దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాదు అనేది మరింత సస్పెన్స్ గా మారింది. దర్శకుడు ఎవరు ఏంటి అనేది ఇంకా బయటకి రావాల్సి ఉందట. రజినీకాంత్ కూడా దర్శకుడు విషయంలో దాటవేశారు. దీనితో వీరిని హ్యాండిల్ చేసే ఆ దర్శకుడు ఎవరు అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా ఇపుడు వైరల్ అవుతుంది.