టాలీవుడ్‌లో తెరకెక్కిన ‘లిటిల్ హార్ట్స్’ చిన్న చిత్రంగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర పెద్ద హిట్‌గా నిలిచింది. సాయి మార్తాండ్ డైరెక్ట్ చేసిన ఈ కామెడీ రోల్ కోస్టర్ చిత్రంలో మౌలి తనుజ్, శివానీ నగరం హీరోహీరోయిన్లుగా నటించారు. యూత్‌ను ఇంప్రెస్ చేసే కామెడీతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సాలిడ్‌గా దూసుకుపోతుంది.
ఇక ఈ సినిమాకు స్టార్స్ నుంచి కూడా మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ‘లిటిల్ హార్ట్స్’ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా, ఫన్ రైడ్‌గా సాగిందని ఆయన తెలిపారు. సాయి మార్తాండ్ డైరెక్షన్ బాగుందని.. నటీనటులు సెన్సేషనల్ పర్ఫార్మెన్స్‌లు ఇచ్చారని ఆయన అన్నారు. ఇక ఈ చిత్ర సంగీత దర్శకుడు సింజిత్ యెర్రమిల్లికి మహేష్ ఓ క్రేజీ ఆఫర్ ఇచ్చాడు. దయచేసి అతడు ఫోన్ ఆపేసి ఎక్కడికి వెళ్లొద్దని.. త్వరలోనే అతడు మరింత బిజీగా మారబోతున్నాడని మహేష్ తెలిపాడు.
దీంతో లిటిల్ హార్ట్స్ మహేష్‌కు ఏ రేంజ్‌లో ఎక్కేసిందో అర్థమవుతుంది. ఇక మహేష్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి డైరెక్షన్‌లో SSMB29 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
#Littlehearts….fun, fresh and big in ❤️❤️❤️the cast is extraordinary…. Especially the young ones.. phew !!! sensatiional acting????????????What a joy ride!!! @SinjithYerramil Nuvvu daya chesi phone aapesi yekkadiki vellodhu brother…. It’s going to be really busy for a…
— Mahesh Babu (@urstrulyMahesh) September 16, 2025