ఓజి : ఇది అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయకండి..!

ఓజి : ఇది అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయకండి..!

Published on Sep 16, 2025 6:01 PM IST

OG movie

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఓజి కోసం ప్రేక్షకులు ఎంతలా వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను దర్శకుడు సుజిత్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా రకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో భాగంగా ఈ సినిమా క్లైమాక్స్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమా క్లైమాక్స్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని.. అయితే, అది కొనసాగింపుగా సాగే క్లైమాక్స్ కాదని తెలుస్తోంది. ఈ సినిమా కథను పర్ఫెక్ట్‌గా ముగించే విధంగా ఈ క్లైమాక్స్ ఉంటుందని సినీ సర్కిల్స్ టాక్.

ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ప్రేక్షకులు ఎక్స్‌పెక్ట్ చేయొద్దని చిత్ర వర్గాల టాక్. మరి నిజంగానే ఈ సినిమాకు సీక్వెల్ ఉండబోదా.. అంటే.. సీక్వెల్ తెరకెక్కించే స్కోప్ ఉన్న కథ ఈ సినిమాలో ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. మరి ఓజి కథ, దాని క్లైమాక్స్ ఎలా ఉంటుందో తెలియాలంటే సెప్టెంబర్ 25 వరకు వెయిట్ చేయాల్సిందే.

తాజా వార్తలు