యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ హీరోగా రితిక నాయక్ హీరోయిన్ గా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన అవైటెడ్ చిత్రం “మిరాయ్” భారీ సక్సెస్ ని చూస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ రెండు రోజుల్లోనే 50 కోట్ల మార్క్ దాటేసిన ఈ సినిమా మూడో రోజు కూడా ఇదే రేంజ్ సాలిడ్ వసూళ్లతో దుమ్ము లేపడం ఖాయం అయ్యింది.
ఇక ఈ సినిమా హిందీ వెర్షన్ లో కూడా గట్టిగానే పెర్ఫామ్ చేస్తుంది. మరి ఈ సినిమా హిందీలో మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ సాధించగా రెండో రోజు భారీ జంప్ అందుకుంది. రెండో రోజు ఏకంగా 77 పర్సెంట్ జంప్ తో 3.1 కోట్ల నెట్ వసూళ్లు అందుకున్నట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
అది కూడా ఆఫర్స్ అన్ని తీసేయగా వచ్చిన మొత్తం అట. దీనితో నార్త్ బెల్ట్ లో మిరాయ్ గట్టిగానే పెర్ఫామ్ చేసేలా ఉందని చెప్పాలి. ఇక ఈ చిత్రం నార్త్ ఇండియా రిలీజ్ కి రానా కీలక పాత్ర పోషించగా గౌర హరి సంగీతం అందించారు. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించారు.