అంత పోటీలో కూడా డీసెంట్ గా పెర్ఫామ్ చేస్తున్న “కిష్కింధపురి”

అంత పోటీలో కూడా డీసెంట్ గా పెర్ఫామ్ చేస్తున్న “కిష్కింధపురి”

Published on Sep 13, 2025 5:59 PM IST

kishkindhapuri

ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో మంచి పోటీ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఓ పక్క మిరాయ్ ఇంకోపక్క కిష్కిందపురి సినిమాలతో యువ హీరోలు తేజ సజ్జ, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లు తమ అదృష్టం పరీక్షించుకోడానికి వచ్చారు. అయితే ఈ రెండు సినిమాలకి కూడా మంచి టాక్ పడింది.

కానీ మిరాయ్ గట్టి పోటీ ఇస్తున్నప్పటికీ “కిష్కింధపురి” సినిమా కూడా ఆ పోటీని తట్టుకొని సాలిడ్ బుకింగ్స్ ని నమోదు చేస్తుంది. ఇలా టాక్ బాగుండడంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాకి కూడా మంచి ఆదరణ అందిస్తున్నారు. మరి ఇదే కొనసాగితే వీకెండ్ కి మంచి వసూళ్లు ఈ సినిమా సాధిస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించగా సాహు గారపాటి నిర్మాణం వహించారు.

తాజా వార్తలు