ప్రస్తుతం థియేటర్స్ లో అదరగొడుతున్న సాలిడ్ హిట్ చిత్రమే “మిరాయ్”. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ హీరోగా కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ సినిమా అంచనాలు అందుకొని పాన్ ఇండియా లెవెల్లో మంచి రన్ ని అందుకుంది. ఇలా సాలిడ్ బుకింగ్స్ తో దూసుకెళ్తున్న సినిమాకి మేకర్స్ ఆల్రెడీ ఓ సక్సెస్ మీట్ కూడా పెట్టి ఆసక్తికర అంశాలు పంచుకున్నారు.
అయితే నిర్మాత విశ్వ ప్రసాద్ మరియు హీరో తేజ సజ్జ ఒకే కీలక అంశాన్ని పంచుకున్నారు. తమ సినిమాకి మాత్రం కనిపించని హీరో రానా దగ్గుబాటి అని రివీల్ చేశారు. రానా తనకి పర్శనల్ గా ఈ సినిమా పరంగా తనకి ఎలాంటి ఉపయోగం లేదని తెలిసినా కూడా తాను ఈ సినిమా కోసం నిలబడ్డారు అని తెలిపారు.
ఇలాంటి సినిమా తెలుగులోనే కాదు హిందీలో కూడా రిలీజ్ చేయాలని తాను మొదటిగా చెప్పారని ఎవరెవరితో మాట్లాడాలి మొత్తం తాను ముందుడి సినిమా కోసం పని చేసారని అలాగే తనకి చిన్న పాత్ర ఉంది అంటే దానికి కూడా నాకు ఉపయోగం లేకపోయినా తేజ సజ్జకి పనికొస్తుందని చేసానని తేజ పంచుకున్నాడు. మొత్తానికి రానా మాత్రం మిరాయ్ భారీ సక్సెస్ లో కీ రోల్ పోషించారని చెప్పాలి.