పాన్ ఇండియా బాక్సాఫీస్ ని షేక్ చేసిన రీసెంట్ చిత్రమే “మహావతార్ నరసింహ”. పెద్దగా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి వసూళ్ల సునామి సృష్టించిన ఈ సినిమా 50 రోజుల రన్ ని పూర్తి చేసుకుంది. మరి ఈ 50 రోజుల తర్వాత మేకర్స్ ఓ ఇంట్రెస్టింగ్ డిలీటెడ్ సీన్ ని వదిలారు. ఈ సినిమాలో హిరణ్యకశ్యపపై ఈ సన్నివేశాన్ని మేకర్స్ రిలీజ్ చేశారు.
సెకండాఫ్ లో తన కొడుకు ప్రహ్లాదుని చంపమని హిరణ్యకశ్యపుడు ఆదేశం ఇస్తాడు అయినప్పటికీ ప్రహ్లాదుని తాను చంపలేకపోతాడు. ఆ కోపంలో మద్యం సేవించిన సమయంలో తన ప్రతిబింబం తనతో మాట్లాడుతూ చిన్న పిల్లాడినే చంపలేకపోతున్నావు ఇక విష్ణువుని ఏం హతమారుతావనే హేళన సన్నివేశం ఇది. దీనిని కూడా థియేటర్స్ లో ఉంచితే బాగున్ను అని ఇది చూసిన నెటిజన్స్ అంటున్నారు. ఇక ఈ సినిమాకి దర్శకుడు అశ్విన్ కుమార్ వర్క్ చేయగా నెక్స్ట్ చిత్రంగా మహావతార్ పరశురామ ని తీసుకొస్తున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి