స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి నటించిన రీసెంట్ మూవీ ‘ఘాటి’ ఇటీవల మంచి బజ్ మధ్య రిలీజ్ అయింది. దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన ఈ సినిమా పూర్తి యాక్షన్ రివెంజ్ డ్రామాగా వచ్చింది. అయితే, ఈ సినిమా ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ హిట్‌ను అందుకోలేకపోయింది.
ఈ సినిమా సక్సెస్‌తో అనుష్క సాలిడ్ కమ్ బ్యాక్ ఇస్తుందని అశించిన అభిమానులకు నిరాశ ఎదురైంది. అయితే, వారికి ఇప్పుడు అనుష్క మరో ఝలక్ ఇచ్చింది. తాను కొంతకాలం సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నట్లు ప్రకటించింది. కొద్దిరోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండి, నిజమైన ప్రపంచానికి దగ్గరగా ఉండాలని.. తాను చేస్తున్న పనిపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని తాను భావిస్తున్నట్లు అనుష్క పేర్కొంది.
తన నిర్ణయాన్ని ఓ లెటర్ రాసి మరీ వెల్లడించింది. దీంతో అభిమానులు ఆమెను మిస్ అవుతామని పేర్కొన్నారు. ఇక అనుష్క ప్రస్తుతం ఓ మలయాళం, తెలుగు చిత్రాలను లైన్లో పెట్టింది. దీంతో ఈ రెండు సినిమాలతో అనుష్క సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని గట్టిగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
View this post on Instagram