లేటెస్ట్ గా థియేటర్స్ లో వచ్చి సాలిడ్ టాక్ ని సొంతం చేసుకున్న చిత్రాల్లో తేజ సజ్జ నటించిన మరో డివోషనల్ చిత్రం “మిరాయ్” కూడా ఒకటి. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ సినిమా యూనానిమస్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాకి సినీ ప్రముఖులు అంతా అదే రీతిలో మంచి ఎగ్జైటింగ్ రెస్పాన్స్ ని అందిస్తుండగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా తన మార్క్ రివ్యూ అందించారు.
తన ఎక్స్ పోస్ట్ లో మిరాయ్ చిత్రాన్ని ఆకాశానికి ఎత్తేసారు. బాహుబలి సినిమా తర్వాత మళ్ళీ ఏదన్నా ఒక సినిమాకి యూనానిమస్ రెస్పాన్స్ ని చూసిన సినిమా ఏదన్నా ఉంది అంటే అది మిరాయ్ అని తాను చెబుతున్నారు. సినిమాలో వి ఎఫ్ ఎక్స్ ఇంకా కథనాలు హాలీవుడ్ లెవెల్ అంటూ తన మార్క్ పోస్ట్ చేయడంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.