సరదాగా అమ్మాయిలతో సినిమాపైనే ఆశలు పెట్టుకున్న వరుణ్ సందేశ్

సరదాగా అమ్మాయిలతో సినిమాపైనే ఆశలు పెట్టుకున్న వరుణ్ సందేశ్

Published on Jun 14, 2013 3:50 AM IST

Saradaga_Ammaitho2
వరుణ్ సందేశ్ ప్రస్తుతం తన కెరీర్లో అధమస్థాయిలో ఉన్నాడు. ఈ మధ్య విడుదలైన అతని ‘ప్రియతమా నీవచట కుశలమా’, ‘చమ్మక్ చల్లో’ సినిమాలు పరాజయం పాలయ్యాయి. ఇప్పుడు అతను ఇదివరకు ‘ఏమైంది ఈ వేళ’ సినిమాలో నటించిన నిషా అగర్వాల్ తో కలిసి ‘సరదాగా అమ్మాయిలతో’ అనే రొమాంటిక్ ఎంటర్టైనర్లో నటిస్తున్నాడు. ఈ సినిమా శ్రీ కుమారస్వామి ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీ పత్తికొండ కుమార స్వామి నిర్మిస్తున్నాడు. భాను శంకర్ దర్శకుడు. ప్రతీ అమ్మాయితోనూ టైం పాస్ చేసే హీరో తన జీవితంలొకి హీరోయిన్ వచ్చాక ఎలాంటి పరిస్థితులను ఎదుర్కున్నాడు అనేది ఈ సినిమా కధాంశం. ఈ సినిమాతో చాలా మంది కొత్తవాళ్ళు పరిచయంకానున్నారు. ఈ చిత్రం ఆద్యంతం వినోదాన్ని పంచిస్తుందని తెలిపారు. ఈ సినిమాకు అంతగా పబ్లిసిటి లేకపోయినా వరుణ్ సందేశ్ మాత్రం ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా సిద్ధార్ద్, హన్సిక నటించిన ‘సంథింగ్… సంథింగ్’ తో ఈ వారం పోటీపడనుంది.

తాజా వార్తలు