గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘అఖండ 2’ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను మాస్ చిత్రాల డైరెక్ట్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇక ఈ చిత్ర రిలీజ్ డేట్‌ను ఇప్పటికే వాయిదా వేశారు మేకర్స్.
దీంతో ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఇంటర్వెల్ ఎపిసోడ్ రికార్డింగ్ జరుగుతుంది. థమన్ ఈ ఎపిసోడ్‌ను మ్యాడ్ లెవెల్‌లో రికార్డ్ చేస్తున్నాడట. అయితే, ఈ రికార్డింగ్‌ను వీక్షించేందుకు బాలకృష్ణతో పాటు దర్శకుడు బోయపాటి శ్రీను కూడా థమన్ స్టూడియోకు వెళ్లారు.
ఇంటర్వెల్ ఎపిసోడ్ రికార్డింగ్ చూసి వారు సంతోషం వ్యక్తం చేశారని థమన్ పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన ఫోటోను థమన్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేయగా అది వైరల్ అవుతోంది.