ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన లేటెస్ట్ కన్నడ హిట్!

ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన లేటెస్ట్ కన్నడ హిట్!

Published on Sep 9, 2025 8:01 AM IST

SuFromSo

ఇటీవల కన్నడ సినిమా నుంచి వచ్చి సూపర్ హిట్ అయ్యిన చిత్రాల్లో “సు ఫ్రమ్ సో” కూడా ఒకటి. టాలెంటెడ్ నటుడు రాజ్ బి శెట్టి నిర్మాణంలో షనీల్ గౌతమ్, J. P. తుమినాడ్, సంధ్య అరకెరె, ప్రకాష్ తుమినాడ్ తదితరులు ప్రధాన పాత్రల్లో దర్శకుడు జెపీ తుమినాడ్ తెరకెక్కించిన ఈ హారర్ కామెడీ సినిమా కన్నడలో మంచి వసూళ్లు సాధించి అదరగొట్టింది.

అయితే తెలుగులో రిలీజ్ అయ్యింది కానీ మన దగ్గర రాణించలేదు. ఇక ఎట్టకేలకి ఈ సినిమా ఓటిటి ఆడియెన్స్ ని అలరించేందుకు సిద్ధం అయ్యింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్ వారు నేటి నుంచి ఈ సినిమాని కన్నడ సహా తెలుగులో కూడా స్ట్రీమింగ్ కి తీసుకొచ్చారు. మరి ఈ సినిమా అప్పుడు మిస్ అయ్యినవారు ఇప్పుడు చూడాలి అనుకుంటే చూడొచ్చు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

తాజా వార్తలు