యూత్‌ఫుల్ ఎంటర్టైనర్స్ ‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టాయి. సంగీత్ శోభన్, రామ్ నితిన్, నార్నే నితిన్‌లతో పాటు, ఈ ఫ్రాంచైజీలో విష్ణు ఓయికి కూడా మంచి బ్రేక్ ఇచ్చాయి. ఆయన చేసిన “లడ్డూ” పాత్ర రెండో భాగంలో కథకి ప్రధాన బలం అయింది.
అసలు ఈ లడ్డూ పాత్రను #90’s వెబ్ సిరీస్‌తో పాపులర్ అయిన యూట్యూబర్ మౌళి తనుజ్కి ఆఫర్ చేశారు. ఈ విషయాన్ని ఆయన తాజాగా ‘లిటిల్ హార్ట్స్’ ప్రమోషన్స్‌లో వెల్లడించారు. ఆడిషన్ లేకుండానే దర్శకుడు కళ్యాణ్ శంకర్ తనను ఎంపిక చేసినట్టు ఆయన చెప్పారు.
ఆ సమయంలో తాను ఎదుర్కొన్న కొన్ని చెడు అనుభవాల వల్ల నటనకంటే రైటింగ్పైనే ఫోకస్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అందుకే ఆ సినిమా చేయలేకపోయానని మౌళి తెలిపారు. ఫలితంగా, ఆ అవకాశం విశ్ణు ఓయికి దక్కగా, ఆయన చేసిన “లడ్డూ” పాత్ర ప్రేక్షకుల మనసు దోచుకుంది.