త్రిబాణధారి బార్బరిక్ ‘గ్రాండ్’ ఆఫర్.. వారికి ఉచిత ప్రదర్శన!

త్రిబాణధారి బార్బరిక్ ‘గ్రాండ్’ ఆఫర్.. వారికి ఉచిత ప్రదర్శన!

Published on Aug 29, 2025 11:00 PM IST

Barbarik

తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కొత్త కాన్సెప్ట్‌, కంటెంట్‌ ఉన్న సినిమాలను ఆదరిస్తారు. అటువంటి ప్రయత్నంగానే విడుదలైన ‘త్రిబాణధారి బార్బరిక్’ సినిమా మొదటి రోజు నుంచే మంచి పాజిటివ్ టాక్‌ సొంతం చేసుకుంది. స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో, వానర సెల్యూలాయిడ్ బ్యానర్‌పై విజయ్ పాల్ రెడ్డి అడిదల నిర్మాణంలో, మోహన్ శ్రీ వత్స దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సత్యరాజ్, ఉదయభాను, వశిష్ట సింహా, సత్యం రాజేష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.

సస్పెన్స్‌, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు భావోద్వేగాలు నింపిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అవుతోంది. ముఖ్యంగా తాత–మనవరాలి సంబంధాన్ని హృద్యంగా చూపించడం వల్ల పెద్దవాళ్లు, మహిళలు ఎక్కువగా ఎమోషనల్ అవుతున్నారు. ఈ నేపధ్యంలో, రాబోయే ‘గ్రాండ్ పేరెంట్స్ డే’ (సెప్టెంబర్ 7)ను పురస్కరించుకుని, సినిమా యూనిట్ ఒక ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఆగస్ట్ 30, 31 తేదీల్లో సాయంత్రం జరిగే షోలకు వెళ్ళే కుటుంబ సభ్యుల్లో తాత, అమ్మమ్మ లేదా నానమ్మలకి ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు.

సినిమా తాత-మనవరాలి బంధం చుట్టూ తిరుగుతూ సమాజానికి మంచి సందేశాన్ని అందిస్తోందనే కారణంగా, ఈ ప్రత్యేక ఉచిత ప్రదర్శనను టీం అందిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు