‘ఓజి’ ఫీవర్.. యూఎస్ మార్కెట్ ని టేకోవర్ చేస్తున్న పవర్ స్టార్!

‘ఓజి’ ఫీవర్.. యూఎస్ మార్కెట్ ని టేకోవర్ చేస్తున్న పవర్ స్టార్!

Published on Aug 29, 2025 8:00 AM IST

OG Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రమే “ఓజి”. దీనిపై ఉన్న హైప్ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి ఇదే హైప్ తో యూఎస్ మార్కెట్ లో పవర్ స్టార్ తన సత్తా చూపిస్తున్నారు. తనకి సరైన సినిమా పడితే ఎలా ఉంటుందో ఇప్పుడు బుకింగ్స్ పరంగా చూపిస్తున్నారు.

యూఎస్ లో రికార్డు రిలీజ్ అవుతున్న ఓజి ఆల్రెడీ హౌస్ ఫుల్స్ తో రికార్డులు సెట్ చేస్తుందట. ఇక లేటెస్ట్ గా ప్రీ సేల్స్ లో ఏకంగా 2 లక్షల డాలర్స్ మార్క్ ని కూడా దాటేసినట్టు తెలుస్తుంది. ఇలా మొత్తానికి ఓజి ఫీవర్ నెక్స్ట్ లెవెల్లో నడుస్తుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ సెప్టెంబర్ 25న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది.

తాజా వార్తలు