అప్పుడే యూఎస్ మార్కెట్ లో ‘ఓజాస్’ ఊచకోత

అప్పుడే యూఎస్ మార్కెట్ లో ‘ఓజాస్’ ఊచకోత

Published on Aug 28, 2025 3:29 PM IST

OG

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “ఓజి”. భారీ హైప్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా కోసం అభిమానులకు ఎదురు చూస్తుండగా ఈ సినిమాతో పాత రికార్డులు అన్నీ లేస్తాయి అని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇలా యూఎస్ మార్కెట్ లో ఓజి సినిమా బుకింగ్స్ ఇలా ఓపెన్ అయ్యాయో లేదో అప్పుడే అక్కడ నెక్స్ట్ లెవెల్ నంబర్స్ ని స్టార్ట్ చేసింది.

కేవలం 3 లొకేషన్స్ బుకింగ్స్ తోనే లక్ష డాలర్స్ దగ్గరకి ఓపెనింగ్స్ మొదలు కావడం అనేది ఓజాస్ ఊచకోత ఏ లెవెల్లో ఉండబోతుంది అనేది చూపించేలా కనిపిస్తుంది. మరి ఈ సినిమా ఫుల్ ఫ్లెడ్జ్ బుకింగ్స్ అయితే మాత్రం ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే ఈ సెప్టెంబర్ 25న గ్రాండ్ గా సినిమా రిలీజ్ కి రాబోతుంది.

తాజా వార్తలు