‘మన శంకర వరప్రసాద్ గారు’.. కొత్త పోస్టర్ తో అదరగొట్టారు!

‘మన శంకర వరప్రసాద్ గారు’.. కొత్త పోస్టర్ తో అదరగొట్టారు!

Published on Aug 27, 2025 1:01 PM IST

Mana-Shankara-Vara-Prasad-G (1)

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార అలాగే క్యాథరిన్ హీరోయిన్స్ గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రమే “మన శంకర వరప్రసాద్ గారు”. మరి మొన్న మెగాస్టార్ పుట్టినరోజు కానుకగా అభిమానులకి టైటిల్ గ్లింప్స్ తో అదిరే ట్రీట్ ని అందించిన మేకర్స్ ఇప్పుడు వినాయక చవితికి ఇంకో ఊహించని సర్ప్రైజ్ ని అందించారని చెప్పాలి. మెగాస్టార్ నుంచి ఓ ఫ్రెష్ లుక్ పోస్టర్ ని విడుదల చేసాక అది చూసిన ఫ్యాన్స్ మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ పోస్టర్ లో చిరంజీవి పట్టు పంచె లుక్ లో అదిరిపోయారని చెప్పాలి. ఒక పడవలో స్టైల్ గా నించుని మెగాస్టార్ వింటేజ్ వైబ్స్ ని అందించారు. దీనితో ఈ పోస్టర్ మాత్రం ఈ పండుగ రోజు మెగా అభిమానులకి మరింత ఆనందాన్ని తీసుకొచ్చింది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందిస్తుండగా షైన్ స్క్రీన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోనే సినిమా విడుదల కాబోతుంది.

తాజా వార్తలు