వివి వినాయక్ రీఎంట్రీ.. ఆ హీరో కోసం మాస్ సబ్జెక్ట్ తో ఆల్ సెట్?

వివి వినాయక్ రీఎంట్రీ.. ఆ హీరో కోసం మాస్ సబ్జెక్ట్ తో ఆల్ సెట్?

Published on Aug 26, 2025 1:30 PM IST

vv-vinayak

మన టాలీవుడ్ సినిమా దగ్గర మంచి మాస్ సినిమాలు ఇచ్చిన దర్శకుల్లో సాలిడ్ ట్రాక్ రికార్డు ఉన్న దర్శకుడు వివి వినాయక్ కూడా ఒకరు. 2000 నుంచి 2010 మధ్యలో తన నుంచి వచ్చిన మాస్ చిత్రాలు ఇప్పటికీ మాస్ ఆడియెన్స్ ని ఓ రేంజ్ లో ఊపేస్తాయి. సాలిడ్ ఫ్యాక్షన్ సినిమాలు అయినా అదుర్స్ లాంటి ఇంట్రెస్టింగ్ కామెడీ, యాక్షన్ లాంటి సినిమాలు అయినా తన నుంచి అలరించాయి.

అయితే గత కొంత కాలం నుంచి తాను సినిమాలకి కొంచెం దూరంగానే ఉన్నారు. మరి గ్యాప్ తర్వాత తాను గట్టి రీఎంట్రీ ప్రిపేర్ చేస్తూ వచ్చారు. ఆ మధ్య వచ్చిన రూమర్స్ ప్రకారం విక్టరీ వెంకటేష్ కోసం వినాయక్ ఓ మాస్ సబ్జెక్టు రెడీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ కి మొట్ట సెట్టయినట్టయిగా తెలుస్తుంది. సో త్వరలోనే ఓ గుడ్ న్యూస్ ఆశించవచ్చు.

ఆల్రెడీ వెంకీ మామ కలయికలో వచ్చిన ‘లక్ష్మి’ సినిమా కూడా పెద్ద హిట్టయ్యింది. మరి మళ్ళీ వీరి నుంచి సినిమా అంటే మినిమమ్ బజ్ గ్యారెంటీ. మరి ఈ కంబ్యాక్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఇంకా రావాల్సి ఉంది.

తాజా వార్తలు